బుధవారం సుప్రీంకోర్టులో థాక్రే వర్గం పిటిషన్ అత్యవసర విచారణ

శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్ నాథ్ షిండేకే కేటాయించడంపై ఉద్ధవ్ థా క్రే వర్గం సుప్రీంకోర్టును... Supreme Court urgently lists Uddhav Thackeray's plea to stay EC order on Shiv Sena for February 22

Update: 2023-02-21 14:34 GMT

న్యూఢిల్లీ: శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్ నాథ్ షిండేకే కేటాయించడంపై ఉద్ధవ్ థా క్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం అత్యవసర విచారణ చేపట్టనుంది. ఈసీ నిర్ణయంపై స్టే విధించాలని కోరగా, సీజేఐ చంద్రచూడ్ మౌఖిక ఉత్తర్వులు ఇచ్చారు. ప్రత్యర్థి వర్గం 'బ్యాంకు ఖాతాలు, ఆస్తులను' స్వాధీనం చేసుకుంటోందని థాక్రే తరుఫు న్యాయవాది సిబల్ చెప్పారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం అసాధారణం, పక్షపాత వైఖరితో కూడుకున్నదని థాక్రే న్యాయవాది తెలిపారు. గతేడాది శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే తన వర్గంతో కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో థాక్రే వర్గానికి మద్దతు తక్కువగా ఉండడంతో శివసేన పార్టీ పేరుతో సహా గుర్తును షిండే వర్గానికి ఈసీ కేటాయించింది. ఈసీ నిర్ణయాన్ని థాక్రే వర్గం వ్యతిరేకిస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

Also Read..

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీకి మరణం ముందే తెలుసు: రాహుల్ గాంధీ

Tags:    

Similar News