ఎన్నికల ముందే ఎందుకు? కేజ్రీవాల్ అరెస్టుపై ఈడీకి సుప్రీం కోర్టు ప్రశ్న

లోక్ సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్టు చేశారని ఈడీని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు విచారణ జరిగింది.

Update: 2024-04-30 13:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్టు చేశారని ఈడీని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు విచారణ జరిగింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు ఈడీని సమాధానం కోరింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట చేసింది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయానికి సంబంధించిన ప్రశ్నపై అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు నుండి ప్రతిస్పందనను కోరింది. జీవితం, స్వేచ్ఛ చాలా ముఖ్యమైనవి అని కోర్టు పేర్కొంది. దానిని ఎవరూ కాదనలేరు అని.. అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజుకు పలు ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో న్యాయపరమైన విచారణలు లేకుండా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కేంద్ర ఏజెన్సీలు చేపట్టవచ్చో లేదో వివరించాలని ఈడీని ఆదేశించింది.

ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి అటాచ్‌మెంట్ చర్య జరగలదేని.. ఒకవేళ జరిగితే కేజ్రీవాల్ కు ఈ విషయంలో ఎలా ప్రమేయం ఉందో చూపించాలని ఆదేశించారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. సార్వత్రిక ఎన్నికలకు ముందే అరెస్టు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. విచారణ ప్రారంభానికి, అరెస్టుకు మధ్య ఇంత పెద్ద గ్యాప్ ఎందుకు వచ్చిందో వివరించాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. వీటిపై శుక్రవారం స్పందించాలని ఈడీని ఆదేశించింది కోర్టు.

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సంబంధించిన వ్యవహారంలో మెటీరియల్ దొరికనట్లు దర్యాప్తు అధికారులో పేర్కొన్నట్లు తెలిపింది కోర్టు. అయితే మిస్టర్ కేజ్రీవాల్ కేసులో ఎలాంటి మెటీరియల్ దొరకలేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఏప్రిల్ 1 నుంచి తీహార్ జైలులో ఉన్న ఆయన మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి అరెస్టుపై చట్టవిరుద్ధంగా ఏమీ లేదని తేల్చిచెప్పింది.

Similar News