మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు షాక్.. రాహుల్ పర్యటన రోజే..!

లోక్‌సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రామ్‌నివాస్‌ రావత్‌ ఆపార్టీకి రాజీనామా చేశారు.

Update: 2024-04-30 11:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రామ్‌నివాస్‌ రావత్‌ ఆపార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి వెంటనే బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ, నరోత్తమ్ మిశ్రా సమక్షంలో బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

భీండ్ జిల్లాలో రాహుల్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నాడు. అదే సమయంలో రామ్ నివాస్ బీజేపీలో చేరారు. రామ్‌నివాస్‌ విజయపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

మార్చి నుంచి బీజేపీ శిబిరంలోకి కాంగ్రెస్ నేతల వలసలు మొదలయ్యాయి. మార్చిలో కొంత మంది నేతలు పార్టీని వీడారు. ఎన్నికలు ప్రకటించిన తర్వాత బీజేపీలో చేరిన రెండో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావత్. మార్చి 29న మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌ సన్నిహితుడు అమర్ వాడ ఎమ్మెల్యే కమలేష్ షా బీజేపీలో చేరారు. ఇండోర్‌లో జరగనున్న ఎన్నికలకు ముందు అక్కడ్నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన బీజేపీలో చేరారు.

మధ్యప్రదేశ్‌లో 29 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019లో బీజేపీ 28 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ కంచుకోట అయిన చింద్వారాలో మాత్రం కాషాయపార్టీ ఓడిపోయింది.ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన కుమారుడు నకుల్‌నాథ్‌ను పోటీకి దింపింది.

Similar News