కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఏమన్నారంటే?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం కుదుటనే ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. టైప్‌-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న కేజ్రీవాల్ కు రెండు యూనిట్ల ఇన్సులిన్ అందిస్తున్నారు.

Update: 2024-04-27 11:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం కుదుటనే ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. టైప్‌-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న కేజ్రీవాల్ కు రెండు యూనిట్ల ఇన్సులిన్ అందిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఐదుగురు డాక్టర్లతో కూడిన వైద్యబృందం కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు.

ప్రస్తుతం కేజ్రీవాల్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయన వాడుతున్న మందులనే కొనసాగించాలని మెడికల్‌ బోర్డు సూచించింది. పాత మందుతలనే వాడాలని.. మెడిసిన్ లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు డాక్టర్లు. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్‌ డోసును కొనసాగించాలని తెలిపారని.. సంబంధిత వర్గాలు తెలిపాయి. వారం తర్వాత ఇదే బృందం కేజ్రీవాల్ ను మరోసారి టెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా కేజ్రీవాల్ షుగర్‌ లెవల్స్‌ 320కు పెరగడంతో గతవారం తీహార్‌ జైల్లో తొలి ఇన్సులిన్‌ అందించారు. తన వ్యక్తిగత వైద్యుడితో రోజూ వీడియో కాన్ఫరెన్స్ లో సంప్రదించే అవకాశాన్ని కల్పించాలంటూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఆరోగ్య కారణాల కింద బెయిల్‌ కోసం మామిడిపండ్లు, ఆలూపూరి తింటున్నారని ఈడీ ఆరోపించింది. దీంతో.. కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చింది కోర్టు. ఈ కేసులో విచారణ కోసం ఎయిమ్స్ వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది ఢిల్లీ కోర్టు. ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా కోర్టు అనుమతించింది. అయితే అది కచ్చితంగా డాక్టర్ సూచించిన డైట్ చార్ట్‌కు కట్టుబడి ఉండాలని పేర్కొంది.

Similar News