గుండెపోటుతో మధ్యప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి మృతి

ఈ విషయాన్ని స్థానిక పార్టీ కార్యాలయం గురువారం వెల్లడించింది.

Update: 2024-05-09 13:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న వేళ మధ్యప్రదేశ్ బీజేపీ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి గోవింద్ మాలూ గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్థానిక పార్టీ కార్యాలయం గురువారం వెల్లడించింది. బుధవారం భోపాల్ నుంచి ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన రాత్రికి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత గుండెపోటు రావడంతో ఆయనను సన్నిహితులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికీ ఆయన మరణించారని వైయులు ధృవీకరించరు. గోవింద్ మాలూ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం ఉదయం ఇండోర్ చేరుకుని నివాళులు అర్పించారు. గోవింద్ మాలూ బీజేపీకి అతిపెద్ద ఆస్తి అని, హఠాత్తుగా ఆయన మరణించడం బాధిస్తోందని సీఎం అన్నారు. పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతలను ఆయన సమర్థవంతంగా చూసుకునేవారని తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణు దత్ శర్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి హితానంద్, ఇతర సీనియర్ నేతలు గోవింద్ మాలూ మృతికి సంతాం వ్యక్తం చేశారు. గోవింద్ మాలూ బీజేపీ రాష్ట్ర విభాగానికి మీడియా ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కాప్రొరేషన్ వైస్-ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 

Tags:    

Similar News