కేంద్ర సాయుధ బలగాల్లో ఎంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలుసా..?!

సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 436 మంది గత మూడేళ్లలో ఆత్మహత్యకు పాల్పడ్డారని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో చెప్పారు.

Update: 2023-03-15 15:08 GMT

న్యూఢిల్లీ: సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 436 మంది గత మూడేళ్లలో ఆత్మహత్యకు పాల్పడ్డారని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో చెప్పారు. ‘సంబంధిత రిస్క్ కారకాలతో పాటు రిస్క్ గ్రూపులను కూడా గుర్తించి సీఆర్‌పీఎఫ్‌లలో అంటే సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎన్ఎస్‌జీ, అస్సాం రైఫిల్స్‌లలో ఆత్మహత్యలు, సోదర హత్యల నివారణకు పరిష్కార చర్యలను సూచించడానికి ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం. త్వరలోనే టాస్క్ ఫోర్స్ తన నివేదికను సమర్పిస్తుంది’ అని రాయ్ లోక్‌సభలో చెప్పారు. 2020లో 144 మంది, 2021లో 157 మంది, 2022లో 135 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్టు రాతపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News