Atrocious: తరగతిగదిలో మూడేళ్ల చిన్నారి మృతదేహం.. నగరాన్ని తాకిన నిరసనల సెగ

తమ ఆరోప్రణంగా పెంచుకుంటున్న తమ కూతురు, బడికెళ్లి బాగా చదువుకుని భవిష్యత్‌లో తమకి మంచి పేరు తెస్తుందని ఆశ పడిన ఆ తల్లిదండ్రులకు ఆవేదనే మిగిలింది.

Update: 2024-05-17 08:28 GMT

దిశ వెబ్ డెస్క్: తమ ఆరో ప్రణంగా పెంచుకుంటున్న తమ కూతురు, బడికెళ్లి బాగా చదువుకుని భవిష్యత్‌లో తమకి మంచి పేరు తెస్తుందని ఆశ పడిన ఆ తల్లిదండ్రులకు ఆవేదనే మిగిలింది. బుడిబుడి అడుగులతో ముద్దుముద్దు మాటలతో తమ కళ్లముందు తిరిగే చిన్నారి కన్నవాళ్ళకి కడుపుకోత మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. స్కూల్‌కి వెళ్లిన ఆ చిన్నారి స్కూల్‌ల్లోనే శవంగా మారింది.

ఈ ఘటన పాట్నాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పాట్నాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న మూడేళ్ల చిన్నారి, ఎప్పటిలానే పాఠశాలకు వెళ్లింది. కాని తిరిగి ఇంటికి రాలేదు. ఈ నేపథ్యంలో చిన్నారి గురించి పాఠశాల యాజమాన్యాన్ని కుటుంబసభ్యులు అడిగారు. అయితే చిన్నారి గురించి తమకు తెలియదు అని పాఠశాల యాజమాన్యం నిర్లక్ష ధోరణితో వ్యవహరించింది. దీనితో కుటుంబసభ్యులు చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, పాఠశాలలో ఓ మూలన ఉన్న డ్రైనేజీలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.

ఎవరికీ కనిపించకుండా డ్రైనేజీలో లోతుగా గొయ్యతీసి చిన్నారి మృతదేహాన్ని పాతిపెట్టినట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకుని, ధర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటన గురించి SP చంద్రప్రకాష్ మాట్లాడుతూ.. పాఠశాలలోని సీసీటీవిలో చిన్నా్రి పాఠశాల లోపలికి వచ్చిన విజువల్స్ మాత్రమే ఉన్నాయని, తిరిగి వెళ్లినట్టు లేవని పేర్నొన్నారు.

ఇక స్కూల్లో చిన్నా్రికి ఏదేనా ప్రమాదం జరిగినట్లైతే వెంటనే కుటుంబసభ్యులకు తెలియజెయ్యాలి, కాని అలా చేయలేదని తెలిపారు. పాప మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్ని్ంచారని, అది చట్టరిత్యా నేరమని, పాప మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్ని్ంచారు కనుక చిన్నారి మృతిని హత్యగా భావిస్తున్నట్టు వెళ్లడించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశామని, వాళ్లరు విచారణ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా చిన్నా్రి మృతి పట్ల స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చిన్నా్రికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. పాఠశాలలోని వాహనాలకు, గోడలను దగ్ధం చేశారు. దీనితో పాట్నాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   

Similar News