నారాయణపురం ఏఎన్ఎంకు కరోనా

దిశ, మునుగోడు: కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొమ్మిది మంది పరీక్షలు చేయగా ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి దీప్తి వెల్లడించారు. బాధిత వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో ఏఎన్ఎంగా పని చేస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. దీంతో నారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మూడురోజులపాటు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా చౌటుప్పల్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఏడుగురికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌గా […]

Update: 2020-08-04 08:21 GMT

దిశ, మునుగోడు: కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొమ్మిది మంది పరీక్షలు చేయగా ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి దీప్తి వెల్లడించారు. బాధిత వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో ఏఎన్ఎంగా పని చేస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. దీంతో నారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మూడురోజులపాటు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా చౌటుప్పల్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఏడుగురికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది.

Tags:    

Similar News