ఏసుక్రీస్తు చూపిన మార్గంలో పయనించాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ, మహబూబ్ నగర్ : ఏసుక్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని, ప్రతి ఒక్కరిని ఏసు సక్రమమైన మార్గంలో నడిపిస్తూ అందరిని చల్లగా చూడాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి ఆవరణలో మహబూబ్ నగర్ పాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి మాట్లాడారు. మహబూబ్ నగర్ పట్టణాన్నీ శాంతియుతమైన పట్టణంగా, అన్ని […]

Update: 2021-12-05 11:52 GMT

దిశ, మహబూబ్ నగర్ : ఏసుక్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని, ప్రతి ఒక్కరిని ఏసు సక్రమమైన మార్గంలో నడిపిస్తూ అందరిని చల్లగా చూడాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి ఆవరణలో మహబూబ్ నగర్ పాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి మాట్లాడారు.

మహబూబ్ నగర్ పట్టణాన్నీ శాంతియుతమైన పట్టణంగా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దుతానన్నారు. పట్టణంలోని ప్రతి ఒక్కరూ సుఖ, సంతోషాలతో జీవించేలా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి ఈ పట్టణాన్ని నిరంతరం అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా తనను ఎన్నుకున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, రెవరెండ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News