Bigg Bossకు నాగార్జున గుడ్ బై.. హోస్టుగా విజయ్ దేవరకొండ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగింపు దశకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో హోస్టుగా నాగార్జుననే చేశారు. కానీ కొన్ని కారణాల వలన బిగ్ బాస్ షోను

Update: 2022-12-16 12:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగింపు దశకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో హోస్టుగా నాగార్జుననే చేశారు. కానీ కొన్ని కారణాల వలన బిగ్ బాస్ షోను నాగార్జున వదిలిపెడుతున్నాడంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్‌కు యంగ్ హీరో విజయదేవరకొండ హోస్టుగా చేయనున్నట్లు తెలుస్తోంది. బీబీ వలన నాగార్జున సినిమాలపై ఫొకస్ పెట్టడం లేదంట. అంతే కాకుండా ఆయన సినిమాలు కూడా ఊహించినంత రేంజ్‌లో సక్సెస్ సాధించలేక పోయాయి. మరో వైపు నాగార్జున హోస్టింగ్ చేసే విధానంలో ఒకరికే సపోర్టుగా ఉంటున్నారంటూ కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన బిగ్ బాస్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారంట. అందువలన బిగ్ బాస్ సీజన్ 7లో విజయ్ దేవరకొండ హోస్టుగా చేయబోతున్నాడంట.

Tags:    

Similar News