50 ఏళ్ల వయస్సులో ప్రియుడితో రెండో బిడ్డను కన్న నటి.. సంచలనం సృష్టిస్తున్న పోస్ట్

బాలీవుడ్ నటి మలైకా అరోరా అందరికీ సుపరిచితమే. ఆమె తెలుగులో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ ఐటెం సాంగ్‌ చేసి అందరినీ మైమరిపించింది.

Update: 2024-05-18 14:08 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ నటి మలైకా అరోరా అందరికీ సుపరిచితమే. ఆమె తెలుగులో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ ఐటెం సాంగ్‌ చేసి అందరినీ మైమరిపించింది. అలాగే పలు సినిమాలు, యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది. ఇక మలైకా అరోరా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు పుట్టాక వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు.

అయినప్పటికీ అర్భాజ్ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌కు మలైకా తన కొడుకుతో హాజరవుతుంది. ఆమె గత కొద్ది కాలంగా తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌లో సహజీవనం చేస్తోంది. పలు వెకేషన్స్‌కు వెళ్తూ ఫొటోలు షేర్ చేస్తుంది. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ క్రమంలో మలైకా అరోరా 50 ఏళ్ల వయస్సులో తల్లి అయిందంటూ ఓ పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

సినీ క్రిటిక్ ఉమైర్ సందు ఆమె ఫొటో షేర్ చేసి మరీ.. మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్ కపూర్ వీర్యకణాలతో సరోగసీ ద్వారా రెండో బిడ్డకు తల్లి అయింది’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన కొందరు నిజమేనా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Similar News