స్టార్ కమెడియన్‌తో యాంకర్ శ్రీముఖి పెళ్లి ఫిక్స్ అయిందా?

బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి చేతినిండా షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అలాగే తన హోస్టింగ్‌తో మాయచేస్తూ అందరినీ మెప్పిస్తోంది.

Update: 2024-05-18 13:47 GMT

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి చేతినిండా షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అలాగే తన హోస్టింగ్‌తో మాయచేస్తూ అందరినీ మెప్పిస్తోంది. సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి శ్రీముఖి పెళ్లి చేసుబోతుందంటూ పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ అమ్మడు స్పందించి క్లారిటీ ఇవ్వడం లేదు.

ఈ క్రమంలో ఓ స్టార్ కమెడియన్ ఆమెను వివాహం చేసుకుంటానని అనడంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అదంతా నిజజీవితంలో కాదు. ఆదివారం విత్ స్టార్ మా షోలో భాగంగా ఫన్నీగా చెప్పినవి. ఈ షోకు శ్రీలక్ష్మి, బాబు మోహన్, అన్నపూర్ణ, హాజరయ్యారు. వెల్ కమ్ చెప్పిన తర్వాత నాకు అందరూ ఫ్యాన్స్. కానీ నేను మాత్రం శ్రీముఖి ఫ్యాన్ ఆమె అంటే ఇష్టం అని అనడంతో ఆమె షాక్ అవుతుంది. ఆ తర్వాత వారు ఆహా నా పెళ్లంటా అనే సాంగ్‌కు డాన్స్ చేశారు.

అయితే శ్రీముఖి స్టేజ్‌పై కూర్చొని నాకెందుకు పెళ్లి జరగట్లేదని అంటుంది. ఈ క్రమంలోనే స్టార్ కమెడియన్ బాబు మోహన్ స్పందిస్తూ.. ‘‘నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా కదా’’ అని ఫన్నీగా అంటాడు. దీంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన వారంతా బాబు మోహన్‌తో శ్రీముఖి పెళ్లి ఫిక్స్? అంటూ సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. 

Tags:    

Similar News