బన్నీ అభిమానులకు సారీ చెప్పిన ‘వరుడు’ నటి

చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఛాన్స్‌లు లేక కనుమరుగైపోతున్నారు.

Update: 2023-03-20 12:31 GMT

దిశ, సినిమా: చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఛాన్స్‌లు లేక కనుమరుగైపోతున్నారు. అలాంటి వారిలో నటి భాను శ్రీ ఒకరు. అల్లు అర్జున్ సరసన ‘వరుడు’ మూవీలో నటించినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఇటీవల ట్విట్టర్‌లో తనను ఫాలో అవుతున్న ఆమెను సడెన్‌గా బన్నీ బ్లాక్ చేశాడు. దీంతో తనతో నటించిన హీరోయిన్‌ని బన్నీ ఎందుకు బ్లాక్ చేశాడని అభిమానులు రచ్చ చేయడంతో మళ్లీ అన్ బ్లాక్ చేశారు. అయితే దీనిపై స్పందించిన భాను శ్రీ.. ‘నా అకౌంట్‌ని అన్ బ్లాక్ చేసినందుకు హ్యాపీ‌గా ఉంది. నాకు అల్లు అర్జున్ అభిమానులను బాధపెట్టాలని ఉద్దేశం లేదు. నేనూ ఆయన అభిమానినే. మరింత ప్రేమను, నవ్వును పంచండి’ అంటూ చిన్న వీడియోను షేర్ చేసింది.

Tags:    

Similar News