ఎన్నికల వేళ..పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళుతున్నారు.

Update: 2024-05-09 13:03 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక టీడీపీ ప్రజాగళం పేరుతో సభ నిర్వహిస్తోంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రోడ్‌షోలతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే జనసేనాని కోసం సినీ నటులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జబర్దస్త్ నటులు, సినీ హీరోలు ప్రచారం నిర్వహించారు. దీని బట్టి గమనిస్తే పవన్ కళ్యాణ్‌కు సినీ ఇండస్ట్రీ నుంచి భారీ మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ పవన్‌కు మద్దతు తెలిపారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు అది వైరల్‌గా మారింది. ఆయన రాజకీయ ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాని తెలిపారు. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా అని హర్షం వ్యక్తం చేశారు. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయని తెలిపారు. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో, అటు సినీ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. దీంతో జనసేనాని గెలుపు ఖాయమని బన్నీ ఫ్యాన్స్, జనసేనాని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Similar News