హాస్యనటుడి శవ పేటిక ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

హాస్య నటుడు చార్లీ చాప్లిన్ జీవితం తెరిచిన పుస్తకం. ఆయనను చూస్తేనే పెదవులపై స్మైల్ వస్తుంది. హాస్నాన్ని పండించడంలో ఆయనకు మించినవారు లేరు.ఆయన జోక్స్ చూస్తే అందరూ సహజంగానే

Update: 2024-04-16 15:19 GMT

దిశ, ఫీచర్స్ : హాస్య నటుడు చార్లీ చాప్లిన్ జీవితం తెరిచిన పుస్తకం. ఆయనను చూస్తేనే పెదవులపై స్మైల్ వస్తుంది. హాస్నాన్ని పండించడంలో ఆయనకు మించినవారు లేరు.ఆయన జోక్స్ చూస్తే అందరూ సహజంగానే నవ్వుతారు. గమ్మతైన వేషధారణతో, సహజమైన నటనతో అందరినీ కడుపుబ్బా నవ్వించే వారు చార్లీ. ఈయన అంటే చాలా మందికి ఇష్టం. అంతే కాదండోయ్..హాస్యనటుల్లో కూడా ఈయన ప్రముఖుడు. అంత గొప్పనటుడి పుట్టిన రోజు ఈరోజు.

కాగా, ఈయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు తెలుసుకుందాం. చార్లీ చాప్లిన్ హాస్యానికి పెట్టింది పేరు. అయితే ఆయన చనిపోయిన తర్వాత చార్లీ శవపేటికను ఇద్దరు దొంగలు, తవ్వి తీసుకెళ్లారంట. ఎందుకంటే ఆయన హాస్యం అతని మెదడులోనే ఉందని నమ్మి, ఆయన శవపేటికను దొంగిలించి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతే కాకుండా శవ పేటిక ఇవ్వాలంటే రూ. 24 లక్షల డాలర్లు ఇవ్వాలని లేకపోతే శవాన్ని ఇవ్వం అంటూ చార్లీ భార్యను బెదిరించారు. దీంతో ఆమె భయపడి డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యిందంట. కానీ చివరకు ఈ విషయం పోలీసులకు చేరడంతో వారు దొంగలను పట్టుకున్నారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది.

Similar News