మైఖేల్ జాక్సన్ బయోపిక్.. మేనల్లుడే హీరో?
కొన్నేళ్ల పాటు ప్రపంచ సంగీతాన్ని శాసించాడు కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్. తన పాటలతోనే కాదు స్టెప్పులతోనూ ఉర్రూతలూగించిన మైఖేల్
దిశ, సినిమా: కొన్నేళ్ల పాటు ప్రపంచ సంగీతాన్ని శాసించాడు కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్. తన పాటలతోనే కాదు స్టెప్పులతోనూ ఉర్రూతలూగించిన మైఖేల్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి దాదాపు 14 ఏళ్లు కావస్తోంది. ఇక రీసెంట్గా ఈ పాప్ కింగ్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైఖేల్ ప్రధాన పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ నటిస్తున్నట్లుగా జీకే స్టూడియోస్ స్పష్టం చేసింది. ఈ చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించగా, గ్రాహం కింగ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.