అచ్చం నయనతారలా ఉన్న అమ్మాయి .. వీడియో చూసి షాక్‌ అవుతున్న ఫ్యాన్స్!

ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. కానీ చాలా మంది దీనిని నమ్మరు. కానీ వీరిని చూస్తే మాత్రం ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పటికే మనం చాలా మంది సెలబ్రిటీల జిరాక్స్ కాఫీ లా ఉన్న

Update: 2024-04-28 15:44 GMT

దిశ, సినిమా : ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. కానీ చాలా మంది దీనిని నమ్మరు. కానీ వీరిని చూస్తే మాత్రం ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పటికే మనం చాలా మంది సెలబ్రిటీల జిరాక్స్ కాఫీ లా ఉన్న వారిని చూశాం. అచ్చం దివంగత హీరోయిన్ సౌందర్యలా ఉన్న చిత్ర అనే అమ్మాయి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా జూనియర్ సమంత, నటి సిల్క్ స్మిత ఇలా చాలా మంది పోలికలతో ఉన్న వారు సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే లేడీ సూపర్ స్టార్ నయనతారను జిరాక్స్ తీసినట్లుగా నెట్టింట ఓ అమ్మాయి వీడియో తెగ హల్చల్ చేస్తున్నాయి. అచ్చుగుద్దినట్లు నయన్ పోలికలతో ఉన్న ఆ అమ్మాయిని చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్.

స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందానికి పెట్టింది పేరు ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా అచ్చం ఈ బ్యూటీలా ఉన్న ఓ అమ్మాయి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఈమె పేరు సజినీ కృష్ణ. ఈమె కొద్ది రోజుల క్రితం ఒడిపోలమా సినిమాలోని ఓ పాటకు లిప్ సింగ్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో స్మోకీ మేకప్ లుక్ తో సాంప్రదాయ దుస్తులను ధరించి , డైలాగ్‌కు తగినట్లుగా ఎక్స్ ప్రెషన్ ఇస్తూ ఆకట్టుకుంది. ఇక ఇది చూసిన వారు అచ్చం నయనతారలానే ఉంది. నయన్‌కు జీరాక్స్ కాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Similar News