Actor Vishal : ఆ సమయం ఎంతో కఠినమైనది చావును దగ్గర నుండి చూశాను.. విశాల్ ఎమోషనల్ కామెంట్స్

తమిళ విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళంలోనే కాకుండా తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

Update: 2023-08-12 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళంలోనే కాకుండా తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే ఇటీవల విశాల్ ఒకప్పటి హీరోయిన్ లక్ష్మీ మీనన్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ పలు వార్తలు వైరల్‌గా మారాయి. విశాల్ వాటిని తిరస్కరించడంతో పాటు ఇలాంటి వాటి వల్ల ఒక అమ్మాయి జీవితంపై ప్రభావం పడుతుందని ఫైర్ అయ్యాడు.

ప్రస్తుతం విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మూవీ యూనిట్ అంతా కూడా ప్రమోషన్ చేయడంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా విశాల్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని షూటింగ్‌లో ఎదురైన భారీ ప్రమాదాన్ని గురించి వివరించాడు. ‘‘ షూటింగ్ సమయంలో నేను ఒక ఫైట్ సీన్ చిత్రీకరణ సమయంలో పక్కన కూర్చుని ఉన్నాను.. సడెన్ గా నా వైపు ఒక పెద్ద ట్రక్కు వస్తూ ఉంది, కొంచెం దూరంలో ఉండగా చూసి ఆ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. ఆ సమయంలో నాకు ఎంతో కఠినమైనది చావును ఎంతో దగ్గరగా చూశాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read More : ఆ హీరోయిన్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్ పోస్ట్ వైరల్

Tags:    

Similar News