అనుపమపై అలాంటి బూతు కామెంట్స్.. స్టేజ్ పైనే గట్టి వార్నింగ్ ఇచ్చిన సిద్ధు జొన్నలగడ్డ
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. మార్చి 29న రిలీజ్ కానుంది.
దిశ, సినిమా : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. మార్చి 29న రిలీజ్ కానుంది. ఇక విడుదల సమయం దగ్గరపడుతుండటంతో మూవీ టీం వరుస ప్రమోషన్స్తో బిజీ బిజీగా ఉంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు.
అయితే ఇప్పటి వరకు వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ.. ఆ ఈవెంట్ కి మాత్రం హాజరు కాలేదు. దానికి ఓ ప్రత్యేక కారణం ఉంది అంటూ హీరో టిల్లు స్పందించాడు.. ‘ నాకు ఇలాంటి ఒక మంచి మూవీ ఇచ్చినందుకు ముందుగా థాంక్యూ. ఈ విషయం గురించి మాట్లాడాల వద్ద అని అనుకున్న కానీ మాట్లాడి తీరాలి.. రీసెంట్ గా ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఓ పోస్టర్ రిలీజైంది. దానికింద చాలా కామెంట్స్ చేశారు. ఒక అమ్మాయి గురించి ఏది పడితే అది అనేయడం కరెక్ట్ కాదు..! మీకు మాట్లాడే హక్కు ఉంది.. నేను దాన్ని తప్పనడం లేదు. ఉదాహరణకు మనం ఒకరిని ఫ్లర్ట్ చేస్తే అవతలివాళ్లు ఎంజాయ్ చేసేలా ఉండాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండొద్దు. తన గురించి పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేశారు. నా అభ్యర్థన ఏంటంటే దయచేసి వల్గర్గా మాట్లాడొద్దు. ఆరోగ్యకర వాతావరణం ఉంటే బాగుంటుంది’ అని చెప్పుకొచ్చాడు. అంటే ఈ నెగెటివ్ కామెంట్స్ వల్లే అనుపమ హట్ అయి ఈవెంట్కు రాలేదని తెలుస్తోంది.