శోభా శెట్టి ఎంగేజ్మెంట్.. పెళ్లి కొడుకుపై జాలి పడుతూ.. పొట్టు పొట్టు తిడుతున్న నెటిజన్లు..

‘కార్తీక దీపం’ సీరియల్‌లో విలన్ మోనితగా ఫేమ్ అయిన శోభా శెట్టి.. తెలుగు ప్రజలకు దగ్గరైంది. ‘బిగ్ బాస్ 7’లో పాల్గొని మరింత పాపులారిటీ పొందింది. కానీ అది కాస్త నెగెటివ్ వేలో కావడం బాధపడాల్సిన విషయమే. రైతు

Update: 2024-05-10 08:24 GMT

దిశ, సినిమా : ‘కార్తీక దీపం’ సీరియల్‌లో విలన్ మోనితగా ఫేమ్ అయిన శోభా శెట్టి.. తెలుగు ప్రజలకు దగ్గరైంది. ‘బిగ్ బాస్ 7’లో పాల్గొని మరింత పాపులారిటీ పొందింది. కానీ అది కాస్త నెగెటివ్ వేలో కావడం బాధపడాల్సిన విషయమే. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, శివాజీ, ప్రిన్స్ యావర్‌ను టార్గెట్ చేయడం ప్రియాంక, అమర్ దీప్‌కు మద్దతు ఇవ్వడం ఆమెకు మైనస్ అయింది. బయటకు వచ్చాక కూడా అంతే వ్యతిరేకత కొనసాగుతుంది. అయితే బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు ఆమె ప్రేమించిన అబ్బాయి టీవీ నటుడు యశ్వంత్యఅని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక అప్పుడు చెప్పినట్లుగానే తాజాగా ఆయనతో నిశ్చితార్థం చేసుకుంది ఈ బ్యూటీ. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.


సిల్వర్ కలర్ లెహంగాలో మెరిసిపోతున్న శోభా శెట్టికి తగినట్లుగానే పెళ్లి కొడుకు కూడా సిల్వర్, గోల్డెన్ కలర్ కాంబినేషన్ శార్వాణి ధరించాడు. ఇద్దరు చాలా హ్యాపీగా ఫొటోలకు పోజులు ఇస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట షేర్ చేశారు. అయితే ఈ పిక్స్ చూసిన నెటిజన్లు.. దారుణంగా విమర్శిస్తున్నారు. ‘పాపం బక్రా దొరికాడు. లైఫ్ నాశనమైపోయింది అతనిది’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘అసలు ఈమెకు పెళ్లి కూడా జరుగుతుందా? ఎన్ని రోజులు భర్తతో ఉంటుందని.. ఎప్పుడూ గొడవలే కదా’ అని ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు.



Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News