పవన్ కల్యాణ్‌కు బిగ్ షాకిచ్చిన చిరంజీవి.. పిఠాపురం వెళ్లడంపై మెగాస్టార్ యూ టర్న్..!

జనసేన అధినేత, సోదరుడు పవన్ కల్యాణ్ తరుఫున పిఠాపురంలో మెగాస్టార్ చిరంజీవి ప్రచారం నిర్వహిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ

Update: 2024-05-10 08:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, సోదరుడు పవన్ కల్యాణ్ తరుఫున పిఠాపురంలో మెగాస్టార్ చిరంజీవి ప్రచారం నిర్వహిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పిఠాపురం వెళ్లడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన సోదరుడు పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం నిర్వహించేందుకు తాను రేపు (శనివారం) పిఠాపురం వెళ్లడం లేదని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తాను పిఠాపురం వెళ్తున్నట్లు జరుగుతోన్న ప్రచారం అంతా అవాస్తమని కొట్టిపారేశారు. ప్రచారానికి తాను రావాలని కూడా తన తమ్ముడు ఎప్పుడూ కోరుకోలేదని తెలిపారు. ప్రస్తుతం తాను రాజీయాలకు అతీతంగా ఉన్నానని మెగాస్టార్ తేల్చి చెప్పారు. తన తమ్ముడికి అండగా ఉన్నానని చెప్పేందుకే ఇటీవల వీడియో విడుదల చేశానని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. ఇక, దివంగత సీఎం, నటుడు నందమూరి తారక రామారావు భారత దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు అర్హుడని మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కాగా, మెగాస్టార్ సోదరుడు పవన్ కల్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ నుండి బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిన పవన్.. ఈసారి పిఠాపురంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు ఎలాగైనా పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని మెగా ఫ్యామిలీ మెంబర్స్ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే నేరుగా రంగంలోకి పిఠాపురంలో ఇంటింటికి తిరుగుతూ పవన్ కల్యాణ్ తరుఫున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ నేరుగా పిఠాపురంలో ప్రత్యక్షంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడి గెలుపు డైరెక్ట్‌గా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ తాను పిఠాపురంలో ప్రచారానికి వెళ్లడం లేదని తాజాగా మెగాస్టార్ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు తెర పడింది. మరోవైపు పవన్ కల్యాణ్ గెలుపును కాంక్షిస్తూ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు సైతం క్యాంపెయినింగ్ చేసిన విషయం తెలిసిందే. 

Read More...

రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. పిఠాపురంలో ప్రచారంపై క్లారిటీ 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News