నడవలేని పరిస్థితిలో ప్రభాస్.. ఆందోళనలో ఫ్యాన్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'ఆదిపురుష్'. త్రీడీ టెక్నాలజీతో తెరకెక్కుతున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది.. Latest Telugu News
దిశ,సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'ఆదిపురుష్'. త్రీడీ టెక్నాలజీతో తెరకెక్కుతున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో కృతిసనన్ సీత పాత్రలో నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ని ఆదివారం విడుదల చేశారు. అయోధ్యలో గ్రాండ్‌గా నిర్వహించిన వేడుకలో పాల్గొన్న ప్రభాస్.. నడవడానికి ఇబ్బంది పడ్డట్లు వీడియోలో పలు చోట్ల కనిపించింది. ప్రభాస్ మెట్లు దిగేందుకు దర్శకుడు ఓం రౌత్, కృతి సనన్ సాయం తీసుకోవడం, చెప్పులు వేసుకునే సందర్భంలోనూ ఇతరుల సాయం అడగిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి : తల్లి అస్థికలు హరిద్వార్ గంగలో కలిపిన మహేష్..