వాళ్లు ఇద్దరు అంటే పడిచచ్చిపోతున్న మమితా..! ఆ హీరో కోసం అలా మారిపోయిందట..

యంగ్ బ్యూటీ మమితా బైజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-05-06 14:24 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మమితా బైజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మలయాళ సినిమా ‘ప్రేమలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ. ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజై మంచి హిట్ అందుకోవడంతో.. మమితాకు టాలీవుడ్‌లో కూడా కుర్రాళ్ల ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమితా టాలీవుడ్‌లో తనకు ఇష్టమైన హీరోలు ఎవరో చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఇక టాలీవుడ్‌లో నాకు రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే చచ్చేంత ఇష్టం. రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ సినిమా నేను దాదాపు 50 సార్లు చూశాను. ఈ మూవీ మలయాళంలో ‘ధీర’ అనే టైటిల్‌తో డబ్ చేయబడింది. అల్లు అర్జున్ నటించిన దాదాపు అన్ని సినిమాలు నేను చూశాను. ఇక ఇప్పటికి కూడా బోరు కొడితే.. ‘జులాయి, ఇద్దరమ్మాయిలతో’ సినిమాలు చూస్తారు. ఆయన స్టైల్‌కు నేను వీరాభిమానిని. అంతే కాకుండా స్కూల్ డేస్‌లో నేను బన్నీలా స్టైల్ చేస్తూ.. టామ్ బాయ్‌లా స్కూల్‌కు వెళ్లేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది మమితా బైజు.

Read More...

రష్మిని చెప్పుతో కొడతానన్న నెటిజన్.. ఆమె రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్ వైరల్) 

Similar News