క్రిష్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. Latest Telugu News

Update: 2022-11-06 11:56 GMT

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ జనవరి ఎండింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో 'హరి హర వీరమల్లు'లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని డిసెంబర్ నెలాఖరుకు కంప్లీట్ చేయాలని, డబ్బింగ్ కూడా పూర్తి కావాలని.. డైరెక్టర్‌కు స్ట్రిక్ట్‌గా చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ 20 రోజుల పాటు కొనసాగనుండగా.. వెంటనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసెంబర్ నెలలో షూటింగ్ పూర్తయ్యేలా చూడాలని.. లేకపోతే అసలు బాగోదని క్రిష్‌కు పవర్ స్టార్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News