పవన్ - ఆద్య ఆ విషయంలో సేమ్ టు సేమ్.. బ్లడ్ రిలేషన్ ఎక్కడికి పోతుంది చెప్పండి.. వీడియోలు కంపేర్ చేస్తూ మురిసిపోతున్న ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ఆయన క్షణం తీరిక లేకుండా హడావిడిగా గడిపేస్తున్నాడు.

Update: 2024-05-06 03:00 GMT

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ఆయన క్షణం తీరిక లేకుండా హడావిడిగా గడిపేస్తున్నాడు. ఇక తాజాగా 'హరిహర వీరమల్లు' టీజర్ తో అదరగొట్టిన పవన్.. వింటేజ్ లుక్ లో వావ్ అనిపించాడు. ఫ్యాన్స్ మురిసిపోయేలా రికార్డులు కొల్లగొట్టాడు. ఇదిలా ఉంటే నెట్టింట పవన్, ఆయన కూతురు ఆద్యకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని కంపేర్ చేస్తున్న అభిమానులు ఖుష్ అవుతున్నారు.

విషయం ఏంటంటే.. పవన్ ను ఓ ఇంటర్వ్యూలో మీకు నచ్చిన పాట ఏంటని అడుగుతాడు ఇంటర్వ్యూయర్. దీనికి అమితాబ్ బచ్చన్ సాంగ్ ' ఏ రాతే ఏ మౌసం' అంటూ పాట పాడి మరి వినిపిస్తాడు. ఇక ఆద్య తొలిసారి ఆడియన్స్ కు అఫిషియల్ గా కనిపించిన షోలో కూడా తన ఫేవరెట్ సాంగ్ అంటూ ఇదే పాట పాడటం విశేషం. దీంతో 'ఆ జీన్స్, బ్లడ్ రిలేషన్ ఎక్కడికి పోతుంది చెప్పండి. ఇద్దరి ఇష్టాయిష్టాలు కూడా ఒకేలా ఉన్నాయి. తండ్రి-కూతుళ్ల బంధం ఇంత గొప్పగా ఉంది ' అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. అయితే విమర్శకులు మాత్రం ఎన్నో కూతురని అడిగేస్తున్నారు.

Tags:    

Similar News