నేను కాస్టింగ్ కౌచ్‌ బాధితురాలినే.. దానికోసం ఫేవర్‌లు అడిగారు

స్టార్ హీరోయిన్ నయనతార తానూ కాస్టింగ్ కౌచ్‌ బాధితురాలినేనంటోంది.

Update: 2023-02-03 07:10 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార తానూ కాస్టింగ్ కౌచ్‌ బాధితురాలినేనంటోంది. ఇటీవల ఓ ఇంటరాక్షన్‌లో కెరీర్ అనుభవాలను పంచుకున్న నటి.. సినీ పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లోనే లైంగికపరమైన వేధింపులు ప్రత్యక్షంగా ఎదుర్కొన్నానని చెప్పింది. ఈ మేరకు ఒక పెద్ద చిత్రంలో కీలకమైన పాత్రను ఇస్తామని చెప్పి తనను ఫేవర్స్ అడిగారన్న నయన్.. దానిని ధైర్యంగా తిరస్కరించారని, ఇలాంటి సంస్కృతిని ఖండించాలని కోరింది. 'నా సొంత ప్రతిభను నమ్ముకునే ప్రత్యేక ముద్ర వేయగలననే నమ్మకంతోనే ముందుకెళ్తా. ఈ 19 ఏళ్ల జర్నీ కేక్‌వాక్ కాదు. జీవితంలో హెచ్చుతగ్గులు చాలా పాఠాలు నేర్పించాయి. నేను చేసిన తప్పులు, మంచి- చెడు దశలు దాటుకుని ఈ స్థాయిలో నిలబడ్డాను. పరిశ్రమలో నిలదొక్కుకోవడం అనుకున్నంత సులువు కాదు. ప్రేక్షకులు, దేవుడు నాపై దయ చూపి ఆశీర్వదించడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నా' అంటూ వివరించింది. 

ఇవి కూడా చదవండి : Rakhi Sawant : నా భర్త పెద్ద మోసగాడు.. ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడు

Tags:    

Similar News