ఇండస్ట్రీలో లొసుగులను ఆమె మాత్రమే బయటపెట్టగలదు.. ఇంకెవరికీ ధైర్యం లేదు

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడే ధైర్యం కంగనా రనౌత్‌కే ఉందంటున్నాడు నవాజుద్దీన్.

Update: 2023-06-26 08:45 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి మాట్లాడే ధైర్యం కంగనా రనౌత్‌కే ఉందంటున్నాడు నవాజుద్దీన్. ఇటీవల కంగన నిర్మించిన ‘టీకూ వెడ్స్ షేరూ’లో నటించిన ఆయన.. తన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగన వ్యక్తిత్వం, ఆమెతో తనకున్న అనుబంధంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘బీ టౌన్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే వాటన్నింటి బయటపెట్టే ధైర్యం కంగనాకే ఉంది. పరిశ్రమలో చాలా మంది రాజకీయాలకు భయపడి అన్ని సరిగానే ఉన్నాయంటారు. మంచి విషయాల గురించే చెబుతారు. తప్పులను ఎత్తిచూపలేరు. కానీ, కంగన మాత్రం తప్పు ఒప్పుల గురించే కాదు.. తాను చేసే పనుల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడుతుంది. ఖచ్చితత్వంతో కూడిన ఆమె వాదనలన్నీ సరైనవే’ అంటూ నటిని పొగిడేశాడు నవాజుద్దీన్.

Tags:    

Similar News