అల్లు అర్జున్ చేసిన పనికి కోపంలో ఊగిపోతున్న చిరంజీవి

ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-05-16 08:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ మధ్య బన్నీ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల ఆయన ఏం చేసిన సంచలనంగానే మారుతుంది. ప్రస్తుతం బన్నీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. పుష్ప చిత్రంతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం పుష్ప కు సీక్వెల్ గా పుష్ప-2 ను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ పాన్ ఇండియా చిత్రం కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బన్నీ ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లో వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు కదా.. ఎన్నికలు ముగిసిన వేళ ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి బన్నీ మీద కోపంతో ఊగిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తీవ్ర చర్చానీయాశంగా మారింది. 

Similar News