'పుష్ప' కాపీ.. నా సినిమానే ఒరిజినల్.. కన్నడ డైరెక్టర్ పోస్ట్‌తో నెట్టింట దుమారం

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' రికార్డులు తిరగరాసింది. దేశం మొత్తం ఒక మానియాలో ఊగిపోయేలా చేసింది.

Update: 2024-05-06 03:32 GMT

దిశ, సినిమా : అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' రికార్డులు తిరగరాసింది. దేశం మొత్తం ఒక మానియాలో ఊగిపోయేలా చేసింది. ఎప్పుడెప్పుడు సెకండ్ పార్ట్ వస్తుందా అని ఎదురుచూసేంత ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఇక రీసెంట్ గా ' పుష్ప : ది రూల్ ' టీజర్, సాంగ్ రిలీజ్ కాగా.. హీరో స్టైల్, స్వాగ్ కు ఫిదా అయిపోయారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా 'ఆహా ఏమున్నాడురా బన్ని' అనేలా చేశాడు. కానీ కన్నడ డైరెక్టర్ ప్రేమ్ మాత్రం క్రిటిసైజ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ స్టైల్ తన సినిమా నుంచి కాపీ కొట్టారని హేళన చేశాడు.

ఓ కన్నడ మీడియా పేజ్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ను స్టోరీస్ లో పెట్టుకున్నాడు ప్రేమ్. ప్రతీ మాస్టర్ పీస్ కు ఒక కాపీ ఉంటుందని.. ' జోగి ' సినిమాలో పునీత్ రాజ్ కుమార్ స్టైల్, షర్ట్ పై చేతి ముద్రను.. 'పుష్ప ' లో అల్లు అర్జున్ షర్ట్ వెనుక ఉన్న చేతి ముద్రను కంపేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. అయితే ఈ విషయాన్ని నెట్టింట కన్నడ ఆడియన్స్ సైతం తప్పు పట్టినా.. ప్రేమ్ మాత్రం గర్వంగా పోస్ట్ పెట్టడంపై మండిపడుతున్నారు టాలీవుడ్ సినీ ప్రేమికులు. అసలు సుకుమార్ క్యారెక్టరైజేషన్ లో డిటెయిలింగ్స్ ఎలా ఉంటాయి తెలుసుకోకుండా ఇలాంటి పోస్ట్ పెట్టడం సిగ్గు చేటని తిట్టిపోస్తున్నారు. ఇతర ఇండస్ట్రీని విమర్శించే ముందు అసలు మీకు ఏముందో అలోంచుకోమని ఏకి పారేస్తున్నారు.


Read More...

BREAKING: దేవర మూవీ యూనిట్‌పై తేనెటీగల దాడి.. ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ 


Full View
Tags:    

Similar News