ఎన్నికల వేల చిక్కుల్లో పడిన స్టార్ హీరోయిన్ జ్యోతిక.. తిట్టిపోస్తున్న కస్తూరి శంకర్ (పోస్ట్)

స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ఓటు గురించి మాట్లాడి చిక్కుల్లో పడింది.

Update: 2024-05-05 08:10 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ఓటు గురించి మాట్లాడి చిక్కుల్లో పడింది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసారా? అని జ్యోతికను యాంకర్ అడగ్గా.. దానికి ఈ అమ్మడు స్పందిస్తూ.. ‘‘కొన్ని సార్లు ఆన్‌లైన్‌లో ఓట్లు వేశాను. అలాగే ప్రతీ ఏడాది ఓట్లు వేస్తాను అని చెప్పింది. దాన్ని మళ్లీ యాంకర్ సరి చేస్తూ మేడమ్ అనడంతో.. జ్యోతిక ఓటింగ్ ఐదేళ్లకు ఒకసారి ఉంటుంది కదా అని చెప్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు స్టార్ హీరోయిన్ అయి ఉండి ఆమెకు ఆ మాత్రం కూడా తెలియదా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. పైగా ఆన్‌లైన్‌లో ఓట్లు వేశారా? అది ఎప్పుడు జరిగిందంటూ దారుణంగా మాట్లాడుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, జ్యోతిక కామెంట్స్‌పై నటి కస్తూరి ట్విట్టర్ వేదికగా మండిపడింది. ‘‘మాలాంటి వాళ్లంతా ఎండలో రోజంతా నిలబడి ఓట్లు వేశాం. అలాగే అమెరికా ప్రయాణాలు ఉంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని వేరే డేట్లకు మార్చుకున్నాము. మిస్ జ్యోతిక ఎందుకు ఓటు వేయలేదు. ఒక్కోసారి మేము ఊర్లో లేకపోయినా వచ్చి మరీ వేశాం. మా కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా. ఆన్‌లైన్ ఓటింగ్ ఉంది, ప్రతిదీ ప్రచారం చేయబడదు’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఏడుస్తున్న ఎమోజీలను కూడా యాడ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట పోస్ట్ వైరల్‌గా మారింది.

Similar News