Adipurush : ‘ఆదిపురుష్’‌కి భారీ నష్టం..

ప్రభాస్ హీరో‌గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ నెల 16న అన్ని ప్రాంతీయ భాషలలో విడుదల కానుంది.

Update: 2023-06-06 13:07 GMT

దిశ, సినిమా: ప్రభాస్ హీరో‌గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ నెల 16న అన్ని ప్రాంతీయ భాషలలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రారంభం అయింది. కానీ షోస్ దొరకట్లేదని సమాచారం. అదే రోజు హాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రం ‘ఫ్లాష్’ కూడా విడుదల కాబోతుంది. దీంతో షోస్ అన్నీ కూడా ఆ సినిమాకే వెళ్లిపోతున్నాయి. టీ సిరీస్ సంస్థ ‘ఆదిపురుష్’ మూవీకి స్క్రీన్స్ పొందడంలో విఫలం అవుతుంది. ఇప్పటి వరకు కేవలం 300 షోస్ మాత్రమే యాడ్ అయ్యాయి. 2D అడ్వాన్స్ బుకింగ్ వీక్‌గా ఉన్నప్పటికీ, 3D మాత్రం ఎక్కువగా ఉన్నాయి. కానీ షోలు 50 మాత్రమే దొరికాయి. దీంతో 1 మిలియన్ డాలర్లు రాబట్టాల్సిన సినిమా, కేవలం 5 లక్షల డాలర్ల దగ్గర ఆగిపోయినట్లు సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 4 కోట్ల నష్టం వాటిలింది.

Read more:

Adipurush Director Om Raut : తిరుమల కొండపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ అపచారం

ప్రభాస్ నిర్మాతగా సీఎం జగన్ బయోపిక్.. మళ్లీ తెరపైకి షర్మిల ఇష్యూ

Tags:    

Similar News