Tollywood అగ్రహీరోల ఫేవరేట్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలకు నచ్చిన హీరోయిన్ల పేర్లు గతంలో వెల్లడించారు.

Update: 2023-06-25 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోలకు నచ్చిన హీరోయిన్ల పేర్లు గతంలో వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. సాధారణంగా హీరోయిన్లకి నచ్చిన హీరోలుంటారు. అలాగే హీరోలకు నచ్చిన హీరోయిన్లు ఉంటారు. అది సీనియర్లు కావచ్చు. జూనియర్లు కావచ్చు. అయితే, మన టాలీవుడ్ హీరోల ఫేవరేట్‌ హీరోయిన్లు ఎవరా తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటారు. కాగా, మన స్టార్ హీరోలకు ఇష్టమైన భామలేవరో ఇప్పుడు తెలుసుకుందాం.. గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఓ సందర్భంలో దీపికా పదుకొనె అంటే ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

భారీ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్‌ అండ్ ఎన్టీఆర్‌.. అలనాటి నటి సావిత్రి పేరు చెప్పారు. ఇక మహేష్ బాబు, రామ్ చరణ్, పోతినేని రామ్- అతిలోక సుందరి శ్రీదేవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రాణీ ముఖర్జీ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ- రాధికా ఆప్టే, గోపిచంద్- సహజ నటి సౌందర్య, ఇక హీరో నిర్మాతగా రాణిస్తోన్న హీరో రానా ఫేవరేట్ హీరోయిన్ కత్రినా కైఫ్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వివరాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Click here for more Cinema news

Tags:    

Similar News