‘Pushpa-2’ మూవీకి బన్నీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో తన సత్తా చాటారు.

Update: 2023-08-24 03:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో తన సత్తా చాటారు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో క్రియేటివ్ డైరెక్టర్ పుష్ప -2 పై ఫోకస్ పెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్‌లో తెరకెక్కించిన పుష్ప రూ.350 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. తొలి పార్ట్‌కు బన్నీ రూ.40 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే రెండో పార్ట్‌కు మాత్రం ఏకంగా రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘పుష్ప - 2’ మూవీ నటీనటులు, టెక్నీషియన్‌కు కలిపి మొత్తం రూ.200 కోట్లు అవుతున్నట్లు టాక్. ‘పుష్ప’ సినిమా ఓ రేంజ్‌లో హిట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ సెకండ్ పార్ట్ కోసం ఏడాది పాటు కూర్చొని వర్క్ చేశారు. అల్లు అర్జున్ ఫాన్స్ సైతం సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.  

Read More:   ఆమె వల్ల నరకం అనుభవించా అంటూ.. అక్కినేని అమలపై సమంత షాకింగ్ కామెంట్స్! 

Tags:    

Similar News