స్పెషల్ డే నాడు స్టార్ డైరెక్టర్ కూతురిని గుర్తు చేసుకున్న దేవిశ్రీ.. వీడియో రిలీజ్ చేస్తూ ఎమోషనల్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలకు మ్యూజిక్ అందించారు.

Update: 2024-04-30 05:03 GMT

దిశ, సినిమా: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఆయన కొన్ని పాటలు కూడా పాడి సింగర్‌గా కూడా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలతో స్టార్ డమ్‌తో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. మరీ ముఖ్యంగా పుష్ప ఊ అంటావా మావా సాంగ్‌తో ఎక్కడలేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. కానీ గత కొద్ది కాలంగా దేవిశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు పెడుతూ అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. తాజాగా, ఏప్రిల్ 29న అంతర్జాతీయ డాన్స్ డే కావడంతో దేవిశ్రీ ప్రసాద్ ఓ వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయిపోయారు.

ఇందులో దేవిశ్రీ ప్రసాద్‌లో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇద్దరు సమంత ఊ అంటావా మావా ఊహు అంటావా సాంగ్‌కు డాన్స్ వేశారు. అయితే ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘‘మీ అందరికీ అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు !!!నేను నమ్ముతాను.. మీరు విచారంగా ఉంటే, డ్యాన్స్.. మీరు సంతోషంగా ఉంటే, డాన్స్ చేయండి. దర్శకుడు షణ్ముగం శంకర్ సార్ కుమార్తె రిసెప్షన్ వేడుక నుంచి ఈ మనోహరమైన డ్యాన్స్ మెమరీకి ధన్యవాదాలు ప్రియమైన రణ్‌వీర్ సింగ్’’ అంటూ ఎమోషనల్ క్యాప్షన్ జత చేశాడు.

ఇటీవల స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా.. దేవిశ్రీ, రణ్‌వీర్ చేసిన వీడియోను షేర్ చేస్తూ అదితిని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన ఫ్యాన్స్ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా దేవిశ్రీ సూపర్ డాన్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Similar News