విడాకులపై ఇలాంటి ట్రోల్స్ చాలా దారుణం.. మాజీ భార్య ట్వీట్‌పై జీవీ ప్రకాశ్ షాకింగ్ రిప్లై

హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ తన భార్య సైంధవితో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-17 11:32 GMT

దిశ, సినిమా: హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ తన భార్య సైంధవితో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల ఇష్యూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 2013 ప్రేమ పెళ్లి చేసుకున్న వీరికి అన్వి అనే కూతురు కూడా ఉంది. ఇక 11 ఏళ్ల వైవాహిక బంధానికి తాజాగా వీడ్కోలు ప‌లికారు ఈ జంట. ఎంతో ఆలోచించి విడాకులు తీసుకున్నట్లు జీవీ ప్రకాశ్, సైంధవి ఇద్దరూ తెలుపుతూ.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అప్పటి నుంచి వీరిపై విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. వీరి ప్రేమ, పెళ్లి, డివోర్స్‌ను టార్గెట్ చేస్తూ.. నెట్టింట కొంత మంది మీమ్స్, ట్రోల్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

అయితే.. ఈ ట్రోల్స్‌పై ఇప్పటికే స్పందించిన జీవీ తమ వ్యక్తిగత జీవితాల గురించి దిగజారి మాట్లాడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా జీవీ ప్రకాష్ మాజీ భార్య సైంధవి కూడా దీనిపై స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ‘నేను జీవీ ప్రకాష్ స్కూల్ డేస్ స్నేహితులం. దాదాపు 24 ఏళ్ల నుంచి మేము ఒకరికి ఒకరం ఉన్నాము. 13 సంవత్సరాలు స్నేహం తర్వాత మేము పెద్దల సమక్షంలో 2013లో పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాలచేత మేము విడాకులు తీసుకుని విడిపోతున్నాము. మా ఏకాగ్రతకు ఎలాంటి ఆటంకం కలిగించకండి. మేము మా అభిప్రాయం ప్రకారమే విడాకులు తీసుకున్నాము. దయచేసి ఎలాంటి ట్రోల్స్ చెయ్యకండి’ అంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది సైంధవి.

తన మాజీ భార్య ట్వీట్‌పై జీవీ ప్రకాశ్ స్పందిస్తూ.. ‘తమ సొంత ఊహల మీద నచ్చిన స్టోరీలు రాసుకునే చానెల్స్‌కు ఇది నిజం కాదు. అలాగే మీరు రాసే మీ సొంత స్టోరీస్ కారణంగా ఎదుటివారు హత్యకు గురవుతుంటారు. కాబట్టి.. ఇలాంటి కష్ట సమయాల్లో కుదిరితే మీ మద్దతు వాళ్లకు తెలిపండి. ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News