CCL 2023: ఫైనల్ మ్యాచ్లో సత్తా చాటిన తెలుగు వారియర్స్

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2023 ఫైనల్ మ్యాచ్లో భోజ్‌పురి దబాంగ్స్ పై గెలిచి రికార్డు సృష్టించింది

Update: 2023-03-26 02:29 GMT

దిశ, వెబ్ డెస్క్: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2023 ఫైనల్ మ్యాచ్లో భోజ్‌పురి దబాంగ్స్ పై గెలిచి రికార్డు సృష్టించింది. వరసగా నాలుగో సారి టైటిల్ ను గెలుచుకుంది. తెలుగు వారియర్స్ టీమ్ కెప్టెన్ అక్కినేని అఖిల్ సూపర్‌గా పెర్ఫర్మ్ చేసాడు. విశాఖపట్నం వేదికగా ఏసిఏ - విడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అక్కినేని అఖిల్‌ 32 బంతుల్లో 67 పరుగులు చేసి ఫైనల్ మ్యాచ్లో తన సత్తా ఏంటో మరో సారి చూపించాడు. ఈ మ్యాచ్లో మన వాళ్లు గెలవడంతో తెలుగు అభిమానులందరు సంబరాలు జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా 3 ఏళ్లు CCL ను నిర్వహించలేకపోయారు. తెలుగు వారియర్స్ 2015 నుంచి 2017 జరిగిన ప్రతి లీగ్లో టైటిల్ గెల్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే జోరును కొనసాగించి టైటిల్‌ను సాధించింది.  

Tags:    

Similar News