నా బాడీ ఎలా చెబితే అలా నడుచుకుంటా: Bhumi Pednekar

దిశ, సినిమా : బ్యూటీఫుల్ యాక్ట్రెస్ భూమి పెడ్నేకర్ బ్యాక్ టు బ్యాక్ సినిమా చాన్స్‌లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.Latest Telugu News

Update: 2022-09-08 12:10 GMT

దిశ, సినిమా : బ్యూటీఫుల్ యాక్ట్రెస్ భూమి పెడ్నేకర్ బ్యాక్ టు బ్యాక్ సినిమా చాన్స్‌లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల కరోనా కారణంగా కొంతకాలం ఖాళీగా ఉన్న నటి సెకండ్ హాఫ్‌లో మాత్రం దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే వరుస షూటింగ్ షెడ్యూల్స్‌తో ఈ ఏడాది నిండిపోయిందని, ఇప్పట్లో ఈ వేగాన్ని తగ్గించే ఆలోచన లేదని రీసెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'మహమ్మారి సమయంలో కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి ప్రతీకారంగా పనిచేస్తున్నా. ప్రస్తుతం చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నాయి.

రెండు పూర్తయితే మరోరెండు షూటింగ్‌కు రెడీగా ఉన్నాయి. 33 ఏళ్ల వయసు వేగాన్ని నా శరీరం ఆస్వాదిస్తోంది. ఈ సమయం చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నా. ఈ అవకాశాలు లభించినందుకు చాలా కృతజ్ఞురాలిని. సినిమాని అమితంగా ప్రేమిస్తున్నా కాబట్టి ఉన్నత స్థితిలో ఉన్నా' అంటూ వివరించింది. చివరగా తన బాడీ పని చేయడం ఆపమని చెప్పినప్పుడే ఈ వేగాన్ని తగ్గిస్తానన్న నటి.. ఏదో ఒక సమయంలో దర్శకత్వం, నిర్మాణం, పాడటం లాంటి పనులతో వైవిధ్యభరితంగా కనిపిస్తానని ముగించింది.

ఇవి కూడా చ‌ద‌వండి : 

తెల్లచీర, మల్లె పూలతో టాలీవుడ్ హీరోయిన్.. అతడి కోసమేనా?

Full View
Tags:    

Similar News