సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఊరు పేరు భైరవ కోన
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవ కోన సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. దర్శకుడు వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న
దిశ, సినిమా : యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవ కోన సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. దర్శకుడు వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న థియేటర్లలో రిలీజై, బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. చాలా రోజుల తర్వాత సందీప్ కిషన్ హిట్ అందుకున్నాడు.
పదికోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈమూవీ ఇరవై కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. కాగా, ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా సైలెంట్‌గా మార్చి8న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, థియేటర్లలో మిస్సైన వారు, ఓటీటీలో చూసేయ్యండి.