చివరిరోజు మహబూబ్ నగర్ జిల్లాలో దాఖలైన నామినేషన్లు ఇవే

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు గాను మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. కసిరెడ్డి నారాయణరెడ్డి మూడు సెట్లు దాఖలు చేయగా, దామోదర్ రెడ్డి రెండు సెట్లు దాఖలు చేశారు. కాగా స్వతంత్ర అభ్యర్థులుగా ఉమ్మడి పాలమూరు […]

Update: 2021-11-23 06:27 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు గాను మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. కసిరెడ్డి నారాయణరెడ్డి మూడు సెట్లు దాఖలు చేయగా, దామోదర్ రెడ్డి రెండు సెట్లు దాఖలు చేశారు. కాగా స్వతంత్ర అభ్యర్థులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన ఎంపీటీసీలు నామినేషన్లు దాఖలు చేశారు.

సోమవారం ఒక నామినేషన్ దాఖలు చేసిన సారాబాయి కృష్ణ చివరి రోజైన మంగళవారం మరో నామినేషన్ చేశారు. కావలి శ్రీశైలం రెండు నామినేషన్లు, మహమ్మద్ గౌస్, బెజ్జం మల్లికార్జున్, రామాంజనేయులు, సుధాకర్ రెడ్డి, షేక్ రహీమ్ పాషా ఒక్కొక్క నామినేషన్ దాఖలు చేశారు. కాగా, కాంగ్రెస్. బీజేపీ పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఆ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం ఆయా అభ్యర్థుల మద్దతుదారులు, అధికార పార్టీ నాయకులు కార్యకర్తలతో సందడిగా మారింది.

Tags:    

Similar News