సంచలన వివాదంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్(వీడియో)

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని ఓ దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(HRC)లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుంది. బాధితుల వివరాల ప్రకారం.. స్థానిక సీఐ మహేశ్వర్‌తో అర్ధరాత్రి తమ ఇంటి‌పై దాడులు చేయిస్తూ భయబ్రాంతులకు గురి చేయిస్తున్నారని వాపోయారు. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న తమ ఇద్దరి ఉద్యోగాలను […]

Update: 2021-07-29 00:44 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని ఓ దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(HRC)లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుంది. బాధితుల వివరాల ప్రకారం.. స్థానిక సీఐ మహేశ్వర్‌తో అర్ధరాత్రి తమ ఇంటి‌పై దాడులు చేయిస్తూ భయబ్రాంతులకు గురి చేయిస్తున్నారని వాపోయారు. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న తమ ఇద్దరి ఉద్యోగాలను కూడా మంత్రి తీసివేయించి, మా కుటుంబాన్ని రోడ్డున పడేశాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని తెలిపారు. అయితే, 2018 ఎన్నికల సమయంలో మంత్రిపై ఉన్న ఓ కేసు విషయంలో ఈ దంపతులు సాక్షిగా ఉన్నారు. దీంతో తమపై కక్ష కట్టి మంత్రి, అతని సోదరుడు అక్రమ కేసులు పెట్టి తమను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇలానే రోజు వేధిస్తే మంత్రిపేరు, అతని సోదరుని పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామని పోలీస్టేషన్ ముందు దంపతులు మంత్రి, అతని తమ్మున్ని హెచ్చరించారు. దంపతులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు.

Tags:    

Similar News