రైతుబంధు రావట్లేదా.. అయితే ఇలా చేయండి

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుబంధు నిధులు ఖాతాలో జమకాకపోయినా, బ్యాంకులు నిలిపేసినా ఏఈఓలను సంప్రదించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు. ఖాతాల వివరాలు సమర్పించిన రైతులకు వారి వారి ఖాతాలలో నిధులు జమ చేయబడతాయని తెలిపారు. రైతుబంధు నిధులను బ్యాంకర్లు పాతబాకీల కింద జమ చేసుకోవద్దని బ్యాంకర్లను ఆదేశించారు. బకాయిల కింద జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి వెంటనే రైతులకు అందజేయాలని తెలిపారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి రైతుబంధు నిధులు జమ చేసుకోవద్దని […]

Update: 2021-06-25 09:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుబంధు నిధులు ఖాతాలో జమకాకపోయినా, బ్యాంకులు నిలిపేసినా ఏఈఓలను సంప్రదించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు. ఖాతాల వివరాలు సమర్పించిన రైతులకు వారి వారి ఖాతాలలో నిధులు జమ చేయబడతాయని తెలిపారు. రైతుబంధు నిధులను బ్యాంకర్లు పాతబాకీల కింద జమ చేసుకోవద్దని బ్యాంకర్లను ఆదేశించారు. బకాయిల కింద జమ చేసుకున్న బ్యాంకులు తిరిగి వెంటనే రైతులకు అందజేయాలని తెలిపారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి రైతుబంధు నిధులు జమ చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చామని తెలిపారు. రైతుబంధుకు అర్హులైన వారందిరికీ ఖాతాల్లో నిధులు జమచేయడం జరిగిందనిచెప్పారు. మొత్తం 147.2 లక్షల ఎకరాలకు చెందిన 60.84 లక్షల మంది రైతులకు రూ.7,360.41 కోట్లు ఖాతాలలో జమచేశామని తెలిపారు.

Tags:    

Similar News