అధికారులకు మంత్రి హరీశ్ రావు హెచ్చరిక

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనుల పురోగతిపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు సోమవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆగస్టు నెలాఖరులోగా జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావాలని ఆదేశించారు. రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానములో నిలవాలని, సీఎం కేసీఆర్ రైతుల పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనం ఈ రైతు వేదికలు అన్నారు. అదే స్ఫూర్తితో జిల్లా యంత్రాంగం పని […]

Update: 2020-08-10 09:51 GMT

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనుల పురోగతిపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు సోమవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆగస్టు నెలాఖరులోగా జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావాలని ఆదేశించారు. రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానములో నిలవాలని, సీఎం కేసీఆర్ రైతుల పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనం ఈ రైతు వేదికలు అన్నారు.

అదే స్ఫూర్తితో జిల్లా యంత్రాంగం పని చేయాలన్నారు. పనులు ముమ్మరంగా సాగాలని, ముమ్మాటికీ ఆగస్టులో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. ఆగష్టు నెలాఖరులోగా పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పనుల్లో జాప్యం చేసే ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతాం అని, రైతు వేదిక నిర్మాణ పనులు జరుగుతున్న తీరును అధికారులు ప్రతీరోజు పర్యవేక్షించాలన్నారు.

Tags:    

Similar News