మావోయిస్టు కరపత్రాల కలకలం

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు కరపత్రాల కలకలం రేగింది. అక్రమంగా అరెస్ట్ చేసిన మావోయిస్టులను విడుదల చేయాలి, ఉ.ప చట్టం, ఎన్ఐఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం చర్ల మండలం తాలిపేరు బ్రిడ్జి సమీపంలో కరపత్రాలను వదిలి వెళ్లారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తాలిపేరు ప్రాజెక్ట్‌ సమీపంలో బలగాలను మోహరించారు. మూడ్రోజుల క్రితం చర్ల- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా […]

Update: 2020-09-09 06:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు కరపత్రాల కలకలం రేగింది. అక్రమంగా అరెస్ట్ చేసిన మావోయిస్టులను విడుదల చేయాలి, ఉ.ప చట్టం, ఎన్ఐఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం చర్ల మండలం తాలిపేరు బ్రిడ్జి సమీపంలో కరపత్రాలను వదిలి వెళ్లారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తాలిపేరు ప్రాజెక్ట్‌ సమీపంలో బలగాలను మోహరించారు. మూడ్రోజుల క్రితం చర్ల- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా తాజాగా కరపత్రాలు లభ్యం అవ్వడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News