LRS.. ఇవాళ ఆఖరి రోజు

దిశ, వెబ్‌డెస్క్ :  రాష్ట్రంలో కొత్తగా పుట్టుకొచ్చిన అనధికారిక ప్లాట్లు, అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణకు తీసుకొచ్చిన LRS గడువు ఇవాళ్టితో ముగియనుంది. బుధవారం వరకు మొత్తం 16,28,884 అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, నిన్న ఒక్కరోజే 2.16 లక్షల అప్లికేషన్లు రావడం గమనార్హం. ఇదిలాఉండగా, తెలంగాణలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెట్‌వర్క్, విద్యుత్ , అధికారిక వెబ్‌సైట్‌లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో చాలా మంది LRS దరఖాస్తులు చేసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే […]

Update: 2020-10-14 22:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కొత్తగా పుట్టుకొచ్చిన అనధికారిక ప్లాట్లు, అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణకు తీసుకొచ్చిన LRS గడువు ఇవాళ్టితో ముగియనుంది. బుధవారం వరకు మొత్తం 16,28,884 అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, నిన్న ఒక్కరోజే 2.16 లక్షల అప్లికేషన్లు రావడం గమనార్హం. ఇదిలాఉండగా, తెలంగాణలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెట్‌వర్క్, విద్యుత్ , అధికారిక వెబ్‌సైట్‌లో ఇబ్బందులు తలెత్తాయి.

దీంతో చాలా మంది LRS దరఖాస్తులు చేసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే గడువు తేదీని పెంచాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజుతో ఎల్‌ఆర్ఎస్ గడువు ముగుస్తుండటంతో ప్రభుత్వ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Tags:    

Similar News