మోడీ కర్ణాటకకు ఇచ్చిందేమి లేదు.. ఖాళీ చెంబు తప్ప: CM రేవంత్ సెటైర్

ప్రధాని మోడీ కర్ణాటకకు ఇచ్చింది ఏమీ లేదు.. ఖాళీ చెంబు తప్ప అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Update: 2024-04-29 09:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ కర్ణాటకకు ఇచ్చింది ఏమీ లేదు.. ఖాళీ చెంబు తప్ప అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీఎం రేవంత్ కర్నాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా గుర్మిట్కల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఐదు గ్యారంటీలను కర్ణాటక ప్రభుత్వం అమలు చేసిందని.. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నామని తెలిపారు. పదేళ్లలో మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోడీ మోసం చేశారని అన్నారు.

40 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించిన మోడీ.. ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదని ఫైర్ అయ్యారు. కర్ణాటక నుంచి బీజేపీకి 26 ఎంపీలను గెలిపిస్తే.. మోడీ కర్ణాటకకు ఇచ్చింది మాత్రం ఒకటే కేబినెట్ పదవని అసహనం వ్యక్తం చేశారు. కరువు వస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రజలను నమ్మించి మోసం చేశారని.. అలాంటి వ్యక్తిని ఓడించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారు.. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండని సూచించారు. ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోరారు. సమర్ధుడు, మీ కోసం కొట్లాడే వారికే ఓటువేసి గెలిపించండని విజ్ఞప్తి చేశారు. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ను గెలిపించండని కోరారు.

Similar News