ఎండలో ఎక్కువ సేపు ఉంటే క్యాన్సర్ ముప్పు.. అస్సలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం...

ఎండలు మండిపోతున్నాయి. ఉదయాన్నే ఏడు కాకముందే తన ప్రతాపాన్ని చూపిస్తున్న భానుడు రాత్రి ఏడు గంటలకు

Update: 2024-04-29 10:07 GMT

దిశ, ఫీచర్స్ : ఎండలు మండిపోతున్నాయి. ఉదయాన్నే ఏడు కాకముందే తన ప్రతాపాన్ని చూపిస్తున్న భానుడు రాత్రి ఏడు గంటలకు కూడా నేనున్నానని చెప్తున్నాడు. ఇక పగటిపూట ఎండ అయితే సరే సరి.. కాసేపు నిల్చుంటే చర్మం కలిపోతుందేమో అన్నంత భయం కలుగుతుంది. వెంటనే నీడకు పరుగెత్తాలని అనిపిస్తుంది. కానీ ఎండలోనే పని చేసేవాళ్లకు ఈ ఛాన్స్ ఉండదు. కానీ కంటిన్యూయస్ గా సన్ బర్న్ జరిగితే క్యాన్సర్ ముప్పు ఉందని హెచ్చరిస్తున్నాయి తాజా అధ్యయనాలు. సూర్యుడి కిరణాల రేడియేషన్ చర్మ కణజాలంలోని DNA కు హాని కలిగించడం.. మ్యూటేషన్ జరిగి క్యాన్సర్ కి దారితీయడం జరుగుతుందట. కాగా దీనివల్ల ఎలాంటి క్యాన్సర్ వస్తుందో తెలుసుకుందాం.

మెలినోమా క్యాన్సర్:

ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకరమని చెప్తున్నారు నిపుణులు. ఎండలో ఎక్కువ సేపు స్పెండ్ చేస్తే వచ్చే ఈ క్యాన్సర్ శస్త్ర చికిత్స ద్వారా మాత్రమే నయమవుతుంది. కీమో థెరపీ, రేడియో థెరపీ కూడా అవసరం.

బేసల్ సెల్ కార్సినోమా క్యాన్సర్:

ముక్కు, చెవి, పెదాలు, భుజాలు, చేతులు సూర్యకిరణాలకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అయినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది. సర్జరీ, రేడియో థెరపీ ద్వారా నయం అవుతుంది.

స్క్రామస్ సెల్ కార్సినోమా క్యాన్సర్ :

మెడ, చెవులు, చేతులు, ముఖంపై వచ్చే క్యాన్సర్ నివారణకు ఖచ్చితంగా సర్జరీ అవసరం.

Similar News