వర్షం పడేముందు గాలులు ఎందుకు వీస్తాయి?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..

కొద్దిసేపట్లో వర్షం రావచ్చు అనే విషయాన్ని మనం ముందుగానే పసిగడతాం. ఎందుకంటే అంతకు ముందు ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి. వాతావరణం చల్లబడుతుంది.

Update: 2024-05-15 14:11 GMT

దిశ, ఫీచర్స్ : కొద్దిసేపట్లో వర్షం రావచ్చు అనే విషయాన్ని మనం ముందుగానే పసిగడతాం. ఎందుకంటే అంతకు ముందు ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుంటాయి. వాతావరణం చల్లబడుతుంది. చల్లటి గాలులు వీస్తాయి. కొన్నిసార్లు బలమైన గాలులు కూడా వీస్తుంటాయి. అయితే వర్షానికి ముందు ఇలా ఎందుకు జరుగుతుందనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రకృతిలో జరిగే కొన్ని పరిణామాలు, వాటి ఉనికి పట్ల మనం పెద్దగా పట్టించుకోం కానీ, వాటికి కొన్ని కారణాలు కచ్చితంగా ఉంటాయి. అట్లనే వర్షం వచ్చే ముందు గాలి వీయడానికి కూడా ఓ రీజన్ ఉంది. నిజానికి గాలి పీడనంలో హెచ్చు తగ్గులవల్ల బలమైన గాలులు, బలహీనమైన గాలులు వీస్తుంటాయి. ఒక ప్రదేశంలో గాలి బాగా వేడెక్కినప్పుడు లేదా అక్కడి నుంచి దూరంగా వెళ్లినప్పుడు, ఆ ప్రాంతంలో గాలి పీడనం తగ్గుతుంది. ఆ సమయంలో చల్లటి ప్రదేశాలలో గాలి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వేడి ప్రదేశాల గాలి ఇక్కడకు వచ్చి చల్లబడుతుంది. చల్లని ప్రదేశాల వద్ద గాలి అలాగే ఉంటుంది కాబట్టి.. ఆ ప్రాంతంలో గాలి పీడనం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ పరిస్థితిలో.. చల్లని ప్రాంతం నుంచి వెచ్చని ప్రదేశంలోకి గాలి భర్తీ చేయబడుతుంది లేదా ప్రవహిస్తుంది. దీని వల్ల గాలులు వీస్తాయి. ఇలా ఒక చోట నుంచి మరో చోటుకు గాలులు వీయడం వల్ల ఏర్పడే పీడనం ధాటికి బలమైన గాలులు వీస్తాయి. వాస్తవానికి గాలి ఎల్లప్పుడూ అధిక వాయువు పీడనం నుంచి అల్ప వాయువు పీడనం దిశగా ప్రవహిస్తుంది. ఈ గాలి అధిక వేగంతో ఖాళీ ప్రదేశాలన్నీ కవర్ చేసినప్పుడు, ఈదురు గాలి లేదా తుఫాను వంటివి సంభవిస్తాయి. అంటే గాలి పీడనం అధికమైనప్పుడు బలమైన గాలులువీస్తాయి. వీటిని తుఫాను గాలులు అని కూడా అంటారు.

Similar News