మహిళలు బికేర్‌ఫుల్.. పీరియడ్స్ టైంలో అవి వాడుతున్నారా? రెండు కిడ్నీలు, రెండు కాళ్లు కోల్పోయిన మహిళ!

పూర్వకాలంలో ఆడవాళ్లు పీరియడ్స్ సమయంలో కాటన్ దుస్తులు ఉపయోగించేవారు.

Update: 2024-05-15 14:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: పూర్వకాలంలో ఆడవాళ్లు పీరియడ్స్ సమయంలో కాటన్ దుస్తులు ఉపయోగించేవారు. తర్వాత కాలం మారుతోన్న కొద్ది శానిటరీ ప్యాడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మహిళలందరూ శానిటరీ ప్యాడ్‌నే వాడుతున్నారు. అయితే భద్రతా కారణాల వల్ల పీడియడ్స్ టైంలో మహిళలు మన్ర్స్టూవల్ కప్పులు, టాంపోన్లు వాడాలని, పీరియడ్స్ కెమికల్, హెల్త్ కు మంచిది కాదని.. కాగా టాంపోన్ లను ఉపయోగించాలని గత కొద్ది రోజుల నుంచి నిపుణులు మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఓ మహిళ టాంపోన్‌ ఉపయోగించి రెండు కాళ్లు పోగొట్టుకుంది. వివరాల్లోకెళ్తే..

24 ఏళ్ల లారెన్ అనే మహిళ టాంపోన్ లను ఉపయోగించింది. ప్రతి 4 గంటలకొకసారి టాంపోన్ లను మార్చింది. కొద్ది నెలల తర్వాత ఫ్లూ లాంటి లక్షణాలు కనిపించాయి. కొన్ని గంటల్లోనే తన కాలుపై నియంత్రణ కోల్పోయింది. కాలు నొప్పి తీవ్రంగా ఉండటంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు తన రెండు కిడ్నీలు కోల్పోయినట్లు చెప్పారు. అలాగే తన కుడి పాదం, ఎడమ్ పాదంలోని కొన్ని వేళ్లను కత్తిరించాలని వైద్యులు చెప్పారు. చివరకు ఎడమకాలు కూడా తీసేయాలని అన్నారు. ఇది టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ అని వైద్యులు తెలిపారు. అయితే టాంపోన్ లేదా మన్ర్స్టూవల్ కప్ గాయం నుంచి ఇన్షెక్షన్ అయినప్పుడు ఈ విధంగా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Similar News