35 ఆండ్రాయిడ్ యాప్స్‌పై మాల్వేర్ వైరస్.. మరి మీ ఫోన్లో అవి ఉన్నాయో లేదో చూసుకోండి

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ స్కామర్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

Update: 2022-08-19 16:43 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ స్కామర్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్క వినియోగదారుడు ఏ యాప్ డౌన్‌లోడ్ చేయాలన్నా.. ప్లే స్టోర్‌కి వెళ్తారు. ఈ క్రమంలో స్కామర్లు మాల్వేర్(మొబైల్ ఫోన్‌లో డేటాను దొంగిలించే వైరస్) సోకిన యాప్‌లను ప్లే స్టోర్‌లోకి ఇంజెక్ట్ చేయడానకి విశ్వప్రయత్నాలు చేస్తారు. ఈ సారి కూడా అదే జరిగింది. ప్లే స్టోర్‌లో 35 హానికరమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునేలా స్కామర్లు వినియోగదారులను మోసగించడంతో సైబర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఇక సైబర్ సెక్యూరిటీ ప్రకారం.. 35 ప్రసిద్ధ ఆండ్రాయిడ్ యాప్‌లలో ప్రమాదకరమైన మాల్వేర్ కనుగొనబడిందని పేర్కొన్నారు. ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వాటి పేరు మారుతుందని, యాప్ ఐకాన్ డివైస్‌లో హైడ్ చేయబడి ఉంటుందని అన్నారు. అయితే దీని వెనుక ఉన్న ముఖ్య ఆలోచన.. డేటాను చోరీ చేసి వాటి ద్వారా ఆదాయాన్ని సంపాదించడమేనని తెలిపారు. మరి ఆ 35 యాప్‌లు ఏంటో తెలుసుకుందాం.

మాల్వేర్‌తో కూడిన యాప్స్ :

వాల్స్ లైట్ - వాల్‌పేపర్స్ ప్యాక్, బిగ్ ఎమోజి- కీబోర్డ్, గ్రాడ్ వాల్ పేపర్స్-3D బ్యాక్‌డ్రాప్‌లు, ఇంజిన్ వాల్‌పేపర్‌లు - లైవ్ & 3D, స్టాక్ వాల్‌పేపర్‌లు - 4K & HD, ఎఫెక్ట్ మేనియా - ఫోటో ఎడిటర్, ఆర్ట్ ఫిల్టర్ - డీప్ ఫోటోఎఫెక్ట్, ఫాస్ట్ ఎమోజి కీబోర్డ్, వాట్సాప్ కోసం స్టిక్కర్స్‌ని క్రియేట్, మాత్ సాల్వ్ (గణిత పరిష్కార)- కెమెరా హెల్పర్, ఫోటో పిక్స్ ఎఫెక్ట్స్ - ఆర్డ్ ఫిల్టర్, లెడ్ థీమ్ - కలర్ ఫుల్ కీబోర్డ్, కీబోర్డ్ - ఫన్ ఎమోజి, స్టిక్కర్, స్మార్ట్ వైఫై, మై GPS లొకేషన్, ఇమేజ్ వార్ప్ కెమెరా, ఆర్ట్ గర్ల్స్ వాల్‌పేపర్ HD, క్యాట్ సిమ్యులేటర్, స్మార్ట్ QR క్రియేటర్, ఓల్డ్ ఫోటోకి కలర్స్ వేయడం, జీపియస్ లోకేషన్ ఫైండర్, గర్ల్స్ ఆర్డ్ వాల్‌పేపర్, స్మార్ట్ క్యూఆర్ స్కానర్, జీపియస్ లొకేషన్ మ్యాప్స్, వాల్యూమ్ కంట్రోల్, సీక్రేట్ హోరోస్కోప్, స్మార్ట్ జీపియస్ లొకేషన్, యానిమేటెడ్ స్టిక్కర్ మాస్టర్, పర్సనాలిటీ ఛార్జింగ్ షో స్లీప్ సౌండ్స్, క్యూఆర్ క్రియేటర్, మీడియా వాల్యూమ్ స్లైడర్, సీక్రేట్ ఆస్ట్రాలజీ, కలరైజ్ ఫోటోస్, ఫై 4k వాల్ పేపర్ - యానిమి HD,

ఈ యాప్‌లలో ఏవైనా డౌన్‌లోడ్ చేసి ఉంటే వాటిని వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. ఇక యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలనుకునే వారు ముందుగా డెవలపర్ పేరు చెక్ చేసి.. ఆపై రేటింగ్ చూసి డౌన్‌లోడ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News