మస్కా కొట్టిన మస్క్.. ప్రియురాలిని మోసం చేసి పైసలన్నీ లాగేసుకున్నాడు.. బిలియనీర్ కథ గిట్లుంటది..

ప్రేమ గుడ్డిది అంటారు కదా. ఈ అమ్మాయి విషయంలో అక్షరాల ఇదే జరిగింది. కాదల్ కాస్త కాటు వేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Update: 2024-04-30 12:29 GMT

దిశ, ఫీచర్స్: ప్రేమ గుడ్డిది అంటారు కదా. ఈ అమ్మాయి విషయంలో అక్షరాల ఇదే జరిగింది. కాదల్ కాస్త కాటు వేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బిలియనీర్ ఎలన్ మస్క్ బయోగ్రఫీ చదివాక సౌత్ కొరియాకు చెందిన అమ్మాయి ఆయనకు ఫిదా అయిపోయింది. తన గురించి సోషల్ మీడియాలో పెట్టడం స్టార్ట్ చేసింది. అయితే దీన్ని అదునుగా తీసుకున్న సైబర్ నేరగాడు తనే మస్క్ అంటూ మస్కా కొట్టాడు.

ముందుగా అమ్మాయికి డౌట్ వచ్చినా వీడియో కాల్స్ కూడా మాట్లడుతుండటంతో తనే అనుకుంది. పైగా రోజుకో చోట మీటింగ్ అనేసరికి నిజమే అని నమ్మేసింది. తన సీక్రెట్స్ అన్నీ చెప్పేసింది. దీంతో నెల తిరిగే లోపు బ్యాంక్ ఎకౌంట్ సున్నా చూపిస్తుంది. ఇదేందని చెక్ చేసుకుంటే అసలు అతను ఎలన్ మస్క్ కాదని, డీప్ ఫేక్ వీడియో ద్వారా తనను నమ్మించాడని అర్థం చేసుకుంది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఏకంగా రూ. 42 లక్షలు బ్యాంక్ నుంచి ట్రాన్స్ ఫర్ అయిపోయాయి.

Similar News